ఎవ‌రూ ఊహించ‌ని హీరోతో శృతి హాస‌న్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్‌!?

అందాల భామ శృతి హాస‌న్ కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య వంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన శృతి.. ప్ర‌స్తుతం చేతినిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గ‌డుపుతోంది. శృతి హాస‌న్ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అలాగే కోలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ న‌టిస్తోంది. తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని హీరోతో శృతి రొమాన్స్ కి రెడీ అయింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. న్యాచుర‌ల్ స్టార్ నాని. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న 30వ చిత్రంలో న‌టిస్తున్నారు. `నాని 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ మూవీతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.

తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఇది. ఇందులో మ‌రొక హీరోయిన్ గా శృతి హాస‌న్ క‌నిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్‌లో శ్రుతిహాసన్ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో నాని భార్యగా శ్రుతిహాసన్ కనిపిస్తున్నారని.. ఈ పాత్ర చిన్నదే అయినా సినిమాలో కీల‌కంగా ఉంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ క్రేజీ కాంబో తెర‌పై ఎలా అల‌రిస్తారో చూడాలి.