సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన‌ ఇంగ్లీష్ సినిమాలు ఎంటో తెలుసా… !

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌యోగాలు చేయాలంటే.. అది అన్న‌గారితోనే సాధ్యం అనేమాట అప్ప‌ట్లో వినిపించేదట‌.. కేరీర్ మొద‌టిలోనే అన్న‌గారు సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుని పోయినా.. త‌ర్వాత మాత్రం.. ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరుగా మారిపోయారు. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు.. కేవీ రెడ్డికి ఒక పేరు ఉండేద‌ట‌.. “మ‌ద్రాస్‌లో నిద్ర‌.. అమెరికాలో క‌ల‌లు” అనేవార‌ట‌. అంటే.. ఆయ‌న సినిమాల్లో అప్ప‌ట్లోనే అధునాత‌న ప్ర‌యోగాల‌కు బీజం ప‌డింది. ఇలా.. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటివారు.. ప్ర‌యోగాల‌కు దిగితే.. విఠ‌లాచార్య వంటివారు.. స్థానిక‌తతో కూడిన ప్ర‌యోగాల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.

Remembering Nandamuri Taraka Rama Rao on his 24th death anniversary: The  life and legacy of Viswa Vikhyatha Nata Sarvabhouma | The Times of India

ఇలా.. సినిమా రంగానికి అంద‌రూ.. ఏదో ఒక విధంగా వ‌న్నె తెచ్చిన వారే. అయితే.. అన్న‌గారు కేవీ రెడ్డి బాట‌లో న‌డిచారు. ఆయ‌న నుంచి పుణికి పుచ్చుకున్న దూర దృష్టిని వినియోగించి.. సినిమాల్లో త‌న‌దైన శైలిలో ప్ర‌యోగాలు చేశారు. ఇలా.. చేసిన‌వే దాన‌వీరశూర క‌ర్ణ సినిమాలోన‌ని కొన్ని సీన్లు. అదేవిధంగా శ్రీకృష్ణ పాండ‌వీయంలోనూ.. అన్న‌గారు ప్ర‌యోగాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

సెట్టింగుల నుంచి.. కారెక్ట‌ర్ల వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన‌వేన‌ని చెప్పే ఎన్టీఆర్‌.. ఏదైనా వినూత్నత ఉంటే త‌ప్ప‌.. ప్రజ‌ల‌ను ఆక‌ర్షించ‌లేమ‌ని అనేవార‌ట‌. ఇలా.. తెలుగు తెర‌పై ప్ర‌యోగాల‌కు సంబంధించి.. అన్న‌గారు.. విరివిగా.. ఇంగ్లీష్ సినిమాలు చూసేవార‌ట‌. పైగా.. మైథాల‌జీతో కూడిన సినిమాలు చూసే వార‌ట‌. నిజానికి అన్న‌గారికి ఉన్న స‌మ‌య‌మే త‌క్కువ‌.

From Lord Krishna to army officer: Roles that endeared NTR to the masses |  The News Minute

కానీ, ఆ స‌మ‌యంలోనూ.. ఆయ‌న త‌న దృష్టిని సినిమాల‌పైనే పెట్టారంటే.. అన్న‌గారికి సినీ రంగంపై ఉన్న శ్ర‌ద్ధ అచంచ‌ల‌మ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా.. శ్రీకృష్ణ‌పాండ‌వీయం.. సినిమాలో చేసిన ప్ర‌యోగాలు.. ఇప్ప‌టికీ.. అన్న‌గారి ముద్ర‌ను ప‌దిలంగా వెండితెర‌పై ఉంచాయ‌ని చెబుతారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు.. అన్న‌గారి ప్ర‌యోగాలు.. అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యేలా చేశాయ‌ని అనడంలో సందేహం లేదు.