వైరల్ గా మారుతున్న శృతిహాసన్ తాజా పచ్చబొట్టు.. అర్థం ఏమిటంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది.. ముఖ్యంగా గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రేమ వ్యవహారం వల్ల కొద్ది సంవత్సరాలు సైతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. దీంతో చాలా డిప్రెషన్ కి గురైన ఈమె ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలలో నటిస్తూ మళ్లీ తన హవా కొనసాగించాలని చూస్తోంది. అలా క్రాక్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Shruti Haasan flaunts her tattoo, posts beautiful monochrome pics -  Telangana Today

ముఖ్యంగా కరోనా సమయంలో కూడా తన దగ్గర ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంది శృతిహాసన్. దీంతో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎలాంటి హీరోలతో నైనా వరుస సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే శృతిహాసన్ బాడీ పైన ఎన్నో టాటూస్ వేయించుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక విభిన్నమైన టాటూను వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈమె వేయించుకున్న ఈ పచ్చబొట్టు విషయానికి వస్తే శృతిహాసన్ లో పలు మార్పులు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది ఈమెయిల్ లోని సరికొత్త కోణాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. శృతిహాసన్ ఒంటిపై ఉన్న పచ్చబొట్టుల విషయానికి వస్తే మణికట్టు పైన గులాబీ..చెవి వెనక సంగీతం గుర్తు టాటోలు కలవు .తాజాగా వేయించుకున్న పచ్చబొట్టు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉన్నది. తాజాగా తనకు ఇష్టమైన దైవం మురుగన్ ఆయుధాన్ని తన టాటోల తన చేతి మీద వేయించుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తమిళంలో తన పేరును కూడా వేయించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈమె వేసుకున్న ఈ టాటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.