విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త..!!

హీరో సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హర్రర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రం విజయం కావడంతో ఈ ముద్దుగుమ్మ తాజాగా డైరెక్టర్ కార్తీక్ దండుకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Virupaksha Review Samyukta Menon in Bommali range.. Virupaksha with twists  and thrills | Virupaksha Movie Review and Rating: Samyuktha Menon's one  woman show
అదేమిటంటే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్టు కొట్టడంతో కార్తీక్ కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను విరిపాక్ష రిలీజ్ రోజు ఒక థియేటర్లో అతని ఫోన్ ఎవరో కొట్టేసారని విన్నాను దీంతో ఈ సినిమా రెస్పాన్స్ చూడడానికి వేరే వాళ్ళ ఫోన్లో చూసేవాడు అందుకే వెంటనే ఐఫోన్ గిఫ్టుగా ఇచ్చారంటూ తెలియజేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు గురించి హాట్ టాపిక్ గా మారుతోంది.

Samyuktha Menon Gifted Iphone To Virupaksha Director Karthik Dandu
మొదట పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా తో పరిచయమైన ఈ మలయాళం ముద్దుగుమ్మ ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. సంయుక్త ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచు గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.