షూటింగ్ అయ్యాక సమంత ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!

సాధార‌ణంగా సెల‌బ్రిటీల ల‌ఫ్‌స్టైల్ చాలా రాయ‌ల్‌గా ఉంటుంద‌ని సామాన్యులు భావిస్తుంటారు. కానీ, అంద‌రి విష‌యంలో అది నిజం అవుతుంద‌ని అనుకుంటే పొర‌పాటే. కొంద‌రు ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయిన‌ప్ప‌టికీ ఎంతో సింపుల్ గా ఉంటారు. ఇంట్లో ప‌నులు, వంటింటి ప‌నులు చేసుకుంటారు.

ఈ లిస్ట్ లో స‌మంత కూడా ఒక‌టి అట‌. అస‌లు షూటింగ్ అయ్యాక స‌మంత ఎలాంటి ప‌నులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఎపిక్ ల‌వ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌మంత‌ను.. `మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మీ ఫీలింగ్ ఏంటని అడగ్గా ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. `నేను పాన్ ఇండియా స్టార్ అని నా పెట్ డాగ్స్ కు ఎవరైనా చెబితే బాగుండు. ఎందుకంటే నేను ఇంకా వాటి మలం క్లీన్ చేస్తున్నా` అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చింది. తాను సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతాన‌ని, సాయంత్రం ఆరు గంటల వరకే తాను స్టార్. ఆ తర్వాత మామూలు మహిళ మాదిరి మారిపోతాన‌ని.. ఇంట్లో అన్ని ప‌నులు చేసుకుంటాను అంటూ స‌మంత చెప్పుకొచ్చింది.