బర్తడే స్పెషల్: మెడలో నల్లపూసలతో దర్శనమిచ్చిన సమంత.. అభిమానులు షాక్..!!

నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత పుట్టినరోజు. 36వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకునింది సమంత . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ ను పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ . ఇలాంటి క్రమంలోనే సమంతకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె నెక్స్ట్ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మనకు తెలిసిందే సమంత శివనిర్వాణ డైరెక్షన్లో చేస్తున్న లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ ని ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ పోస్టుర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సమంత చాలా క్యూట్ గా ట్రెడిషనల్ గా కనిపించింది .

ట్రెడిషనల్ బట్టల్లో చాలా స్మైలీ గా ఉన్న సమంత మెడలో నల్లపూసల దండ ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు దీన్ని బట్టి చూస్తుంటే సమంతకి సినిమాలో పెళ్లి అయిపోతుంది . ఆమె ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ఈ సినిమాలో కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అని ..సమంత అభిమానులకు బాగా నచ్చుతుంది అని ..ఈ సినిమాతో సమంత మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అంటున్నారు జనాలు . ప్రజెంట్ సమంత మెడలో నల్లపూసలు వేసుకున్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

Share post:

Latest