ఆ హీరోయిన్‌తో పవన్ డిష్యుం డిష్యుం.. వారి మధ్య జరిగేది ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG, సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు సినిమాతో పలకరించనున్నాడు. మొత్తంగా ఈ పవర్ ఫుల్ హీరో నాలుగైదు సినిమాల్లో చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్‌తో పిరియాడిక్ జోనర్‌లో వస్తోంది.

మొగల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకుంటూ ఉన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది. దురదృష్టం కొద్దీ అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో చేసేది లేక సినిమా బృందం టాకీ పార్టును లాగించేస్తోందని సమాచారం. సర్కిల్లో జరుగుతున్న చర్చ ప్రకారం, పవన్ వేరే చిత్రాల షూటింగ్స్ తో బిజీ అయిపోయాడట అందుకే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయలేకపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో హరిహర వీరమల్లు నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. అందుకే ఈ మూవీలో బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ యాక్టర్స్ ను తీసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని కూడా జాయిన్ చేసుకున్నారు. ఈ హాట్ బాంబ్ రోషనరా బేగం అనే ఓ నెగిటివ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ మూవీలో ఒక ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ సీన్‌ను ఏప్రిల్ 11 నుంచి షూట్ చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ షూట్‌లో పవన్ కళ్యాణ్ – నోరా ఫతేహి మధ్య హై ఇంటెన్స్ యాక్షన్ సీన్లు షూట్ చేయనున్నారని టాక్. పవన్, నోరా కత్తులతో భీకర యుద్ధం చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ మూవీపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.