Puspa -2 లో సమంత స్పెషల్ సాంగ్ పై.. క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన ఈ హీరోయిన్ ఉన్న క్రేజ్ మాత్రం తగ్గేదే లేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత. ఈమె నటించిన సినిమాలన్నీ ఈమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈమె చేతినిండా అవకాశాలే.. ఈ మధ్యనే లేడీ ఒరియాంటెడ్ గా యశోద సినిమాతో అదరగొట్టింది. ఆ తరువాత నిన్నటి రోజున గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా తో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యింది. అయితే ఇందులో భాగంగా ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత ఒక ఇంటర్వ్యూ లో సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

After "Oo Antava" massive success, Samantha Prabhu turns down Allu Arjun's Pushpa  2: Report

అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప-1లో ఐటెం సాంగ్ తో కుర్రకారును తన వెంట తిప్పుకుంది సమంత. ఇక ఆ సాంగ్ సమంతా కి ఎంత క్రేజ్ ను తెచ్చిపెట్టిందంటే .. దీంతో పాన్ ఇండియా లేవలో పాపులర్ అయింది.ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంత మందిని ఆకట్టుకుందో అంతకంటే ఎక్కువ మందిని ఆకట్టుకుంది సమంత.అయితే ఇప్పుడు పుష్ప-2 లో కూడా సమంత ఐటమ్ సాంగ్ చేస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

Pushpa: Samantha Ruth Prabhu killer dance moves item song Oo Antava leaves  netizens drooling | Regional-cinema News – India TV
తాజాగా ఈ విషయంపై.. సమంతకు ఇదే ప్రశ్న ఎదురైయ్యింది. అందుకు సమాధానంగా సమంత నేను పుష్ప -2లో ఐటమ్ సాంగ్ ని చేయలేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. అభిమానులు అనుకున్నట్లుగా నేను పుష్ప-2 లో చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.. దీంతో కొంతమంది ఆనందంగా ఉండగా.. మరికొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు. ఏదేమైనా పుష్ప సినిమాకి ఐటమ్ సాంగ్ తో చాలా మంచి గుర్తింపు వచ్చింది. మరి పుష్ప -2 లో ఎవరు ఐటమ్ సాంగ్ ను చేయబోతున్నారో చూడాలి మరి.