పుష్ప 3 కూడా ఉందట! అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సుకుమార్‌?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. 2021లో రిలీజైన పుష్ప పార్ట్ 1 ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విస్తుపోయేలా చేసింది. కాగా పుష్ప చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప 2 సీక్వెల్ నిర్మాణం జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

400 కోట్ల రూపాయలను మేకింగ్ కోసం ఖర్చు పెట్టబోతుండగా మరో వంద కోట్ల రూపాయలను ప్రమోషన్ కోసం ఖర్చు చేయబోతున్నట్టు టాక్ వినబడుతోంది. మొత్తానికి పుష్ప 2 చిత్రం భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది జోశ్యం చెప్పేస్తున్నారు. ఒక వేళ పుష్ప 2 చిత్రం రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేస్తే పుష్ప 3 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సుకుమార్ టీమ్ మెంబర్స్ గుసగుసలాడుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.

అల్లు అర్జున్ మరియు సుకుమార్ మదిలో మూడవ పార్ట్ కి సంబంధించిన ఆలోచన కూడా ఉందనే విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దాంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ కూడా ముగియనుందట. అంటే దాదాపు ఒక సంవత్సరంపాటు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతోను, ప్రమోషన్స్ తోనూ బిజీగా ఉంటుందన్నమాట.