హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు.

అయితే కొందరు హీరోయిన్లు మాత్రం మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైపోతూ ఉంటారు. అయితే ఎక్కువమంది స్టార్ హీరోయిన్లు వ్యాపారవేత్తలనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

శిల్పాశెట్టి :
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తెలుగులో సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య‌, భ‌లేవాడివి బాసు, ఆజాద్ సినిమాలు చేసింది. ఆమె ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రాను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అది రాజ్‌కుంద్రాకు రెండో పెళ్లి అని టాక్ ?

ఇషా కొప్పిక‌ర్ :
తెలుగులో చంద్ర‌లేఖ‌, ప్రేమ‌తో రా సినిమాలు చేసిన బాలీవుడ్ భామ ఇషా కొప్పిక‌ర్ ముంబైలో ఎన్నో హోట‌ల్స్‌కు అధిప‌తి అయిన టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకుంది.

ఆశిన్ :
గ‌జినీ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది ఆశిన్‌. ఆమె తెలుగులో శివ‌మ‌ణి, ఘ‌ర్ష‌ణ‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా లాంటి సినిమాలు చేసింది. ఆమె మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శ‌ర్మ‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

రీమాసేన్ :
చిత్రం, మ‌న‌సంతా నువ్వే, వ‌ల్ల‌భ‌, బావ న‌చ్చాడు, సీమ‌సింహం సినిమాలు చేసిన రీమాసేన్ బిజినెస్‌మేన్ శివ‌క‌ర‌ణ్‌సింగ్‌ను పెళ్లాడింది.

When Ayesha Takia was called insane for marrying Farhan Azmi at 23అయేషా ట‌కియా :
తెలుగులో నాగార్జున‌తో సూప‌ర్ సినిమా చేసిన అయేషా ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై హోట‌ల్ బిజినెస్‌లో ఆరితేరిన ఫ్యామిలీ, పొలిటిషీయ‌న్ అయిన అబూ అజ్మీ కొడుకు ఫ‌ర్హాన్ అజ్మీని పెళ్లాడింది.

ప్రియ‌మ‌ణి :
పెళ్లైన‌కొత్త‌లో, ర‌గ‌డ‌, రాజ్‌, ద్రోణ‌, నార‌ప్ప సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన ప్రియ‌మ‌ణి ఈవెంట్ ఆర్గ‌నైజింగ్ బిజినెస్ చేసే ముస్త‌ఫారాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

పూర్ణ :
అవును, అవును 2, సీమ‌ట‌పాకాయ్‌, అఖండ‌, దృశ్యం 2 సినిమాల భామ పూర్ణ దుబాయ్‌లో వ్యాపారాలు చేసే సానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకుంది.


న‌దియా :
ఒక‌ప్ప‌టి క్రేజీ హీరోయిన్ న‌దియా ఇప్పుడు మిర్చి, అత్తారింటికి దారేది సినిమాలతో పాపుల‌ర్ అయ్యింది. ఆమె ప్ర‌ముఖ బిజినెస్ మేన్ శిరీష్ గాడ్‌బోలేను పెళ్లాడింది. శిరీష్ న‌దియాకు చిన్న‌ప్పటి స్నేహితుడే.

Kajal Aggarwal And Her Husband, Gautam Kitchlu Are Expecting Their First  Child?

కాజ‌ల్ :
కాజ‌ల్ తెలుగులో ఎంత పాపుల‌రో తెలిసిందే. మ‌గ‌ధీర లాంటి ఇండ‌స్ట్రీ హిట్‌తో మొద‌లు పెట్టి ఎంతో మంది సీనియ‌ర్ హీరోలు, జూనియ‌ర్ల‌తో కూడా న‌టించింది. కాజ‌ల్ త‌న చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడింది.

Hansika Motwani Is Back In Mumbai, Looks Pretty In Pink Suit As She Flaunts  Mangalsutra Andహ‌న్సిక :
యాపిల్ బ్యూటీ హన్సిక కూడా త‌న‌ స్నేహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ క‌టూరియాను వివాహం చేసుకుంది.