పెళ్లిపై ప్ర‌శ్న‌.. అఖిల్ ఆన్స‌ర్ కు అంతా షాక్‌!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోడ‌ల్‌ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు.

అనేక వాయిదాల అనంత‌రం ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అఖిల్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యాడు. సినిమాకు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ రిపోర్ట‌ర్ `పెళ్లెప్పుడు..?` అని ప్ర‌శ్నించ‌గా.. అఖిల్ అదిరిపోయే ఆన్స‌ర్ తో అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

`అప్పుడే పెళ్లి చేసుకుంటారా.. ప్ర‌స్తుతం సింగిల్ గానే హ్యాపీగా ఉన్నాను` అంటూ అఖిల్ రిప్లై ఇచ్చాడు. త‌న‌కు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని ప‌రోక్షంగా తేల్చేశాడు. కాగా, అఖిల్ గ‌తంలో ప్రముఖ పారిశ్రమామిక వేత్త జీవీకే కంపెనీల అధినేత మన‌వ‌రాలు అయిన శ్రీయా భూపాల్ ను ప్రేమించాడు. పెద్ద‌లు వీరిద్ద‌రికీ గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారు. ఇట‌లీలో పెళ్లి చేయాల‌ని భారీ ఏర్పాట్లు చేశారు. కానీ, ఏమైందో ఏమో పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే శ్రీయా, అఖిల్ విడిపోయాడు. కొన్నేళ్ల‌కు శ్రీయా మ‌రో పెళ్లి చేసుకోగా.. అఖిల్ మాత్రం ఒంట‌రిగానే ఉంటున్నాడు.