ప్రభాస్ సోషల్ మీడియాలో ఆ 15 మందినే ఫాలో అవుతున్నాడా.. ఇంతకీ వారు ఎవరంటే..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలతో ఒకసారిగా రెబెల్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రధానంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆయన సినిమాల కోసమే కాకుండా ఆయన ప్రతి అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంలోనూ ప్రభాస్ ను ఆరాధించే అభిమానులు ఎక్కువే.

ప్రధానంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎందరో అభిమానులు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. తనను ప్రేమించి అభిమానులకు ఎటువంటి చిన్న కష్టం వచ్చినా వారికి కొండంత అభయమిస్తాడు. అంతేకాకుండా తన తోటి నటీనటులకు కూడా కడుపునిండా భోజనం పెడతాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్‌, ప్రాజెక్ట్ కే, వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అయితే ప్రభాస్ అందరి హీరోల లాగా సోషల్ మీడియాలో మాత్రం కాస్త స్లోగా ఉంటాడు. కేవలం తన సినిమాల విషయాలు మాత్రమే తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

ప్రస్తుతం ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ ఉన్నారు. అంటే అక్షరాల 90 లక్షల కంటే ఎక్కువ మంది ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. మరీ వారంతా ఎవరో అనుకుంటున్నారా. ప్రభాస్ ఫాలో అవుతున్న వారిలో ముందుగా వచ్చేది తన పెద్దనాన్న దివంగత హీరో కృష్ణంరాజు.

ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ వంగా. అలాగే ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ రాధాకృష్ణ, శ్రుతి హాసన్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ ఓంరౌత్, దీపికా పదుకొణే, నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, సాహో డైరెక్టర్ సుజిత్ ఉన్నారు. అంతేకాకుండా తెలుగులో ఉన్న తన తోటి స్టార్ హీరోలు ఎవరిని ఫాలో అవటం లేదు. కానీ తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో ప్రభాస్ మంచి సాన్నిహిత్యంతో ఉంటాడు.