హీరోయిన్ ఆఫ‌ర్ కోసం రెండు సార్లు ఆ ప‌ని చేశా.. డింపుల్ హ‌యాతి షాకింగ్ కామెంట్స్‌!

డింపుల్ హయాతి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించి టాలెంట్ ఉన్నా.. డింపుల్ హ‌యాతికి అదృష్టం మాత్రం లేదు. గద్దలకొండ గణేష్ మూవీలో `జ‌ర్ర జ‌ర్ర‌` పాట‌తో పాపుల‌ర్ అయిన డింపుల్.. ఆపై హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేసింది.

కానీ, స‌క్సెస్ మాత్రం వ‌రించ‌లేదు. వ‌రుస ఫ్లాపులు ఎదుర‌డంతో డింపుల్ హ‌యాతికి ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా త‌గిలించారు. అయితే ఈ బ్యూటీ `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీవాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న డింపుల్‌.. త‌న కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ లో ఐదేళ్లు గ‌డిచిపోయినా బేబీ స్టెప్సే వేస్తున్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక రామ‌బాణంలో నేను యూట్యూబ్ బ్లాగ‌ర్ భైర‌వి పాత్ర‌లో క‌నిపిస్తారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఆఫ‌ర్ కోసం రెండు సార్లు ఆడిష‌న్ ఇచ్చాను. ఆ త‌ర్వాతే భైర‌వి పాత్ర‌ను నేని స‌రిపోతాన‌ని శ్రీ‌వాస్ గారిని న‌మ్మ‌కం కుదిరించి. ఈ సినిమా ఖ‌చ్చితంగా మంచి విజ‌యం సాధిస్తుంది` అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మ‌రి రామ‌బాణంతో అయినా డింపుల్ జాత‌కం మారుతుందా..లేదా.. అన్న‌ది చూడాలి.