పెళ్లికూతురుగా ముస్తాబయి షాక్ ఇచ్చిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎన్నోసార్లు ఖండించింది శ్రీముఖి. ప్రస్తుతం తన దృష్టి కెరియర్ మీదే ఉందని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.అలాగే తన మీద వచ్చే వార్తల పైన మండిపడుతూ ఉంటుంది.

తాజాగా శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో శ్రీముఖి ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకుంటుందా అంటూ అభిమానులు, నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరొకవైపు యాంకరింగ్ స్పీడ్ గా ఉన్న శ్రీముఖి భారీగానే సంపాదిస్తోంది. ముఖ్యంగా ఈమె లగ్జరీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో ఒక సొంతిల్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది శ్రీముఖి. కొత్తగా స్టార్ మా లో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెర పైన హీరోయిన్గా మెరవాలని ఈమె కోరుకుంటుంది. ఇందులో భాగంగా తనకు వచ్చిన అవకాశాలను సైతం ఒప్పుకుంటూ ఉంటోంది. క్రేజీ అంకుల్స్ సినిమాలు శ్రీముఖి చివరిగా హీరోయిన్గా నటించింది.కానీ సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణ నటించబోతున్న 108వ సినిమాలో కూడా ఇమే ఒక కీ రోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.