వారెవ్వ: బన్నీ స్పెషల్ రికార్డ్..’పుష్ప’ టీజర్ ని ఏ లాంగ్వేజ్ లో ఎక్కువగా చూశారో తెలుసా? తెలుగు మాత్రం కాదు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తుంది . టాలీవుడ్ లో .. బాలీవుడ్ లో .. కోలీవుడ్లో ఎక్కడ చూసినా సరే పుష్ప.. పుష్పరాజ్..నీ యవ్వ తగ్గేదేలే అన్న డైలాగ్ మారుమ్రోగిపోతుంది . ఈరోజు బన్నీ పుట్టినరోజు . ఈ క్రమంలోనే నిన్న సుకుమార్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేశారు . ఏం ముహూర్తాన టీజర్ రిలీజ్ చేశారో కానీ అప్పటినుంచి జనాల మైండ్ మొత్తం పుష్ప 2 చుట్టే తిరుగుతూ ఉంది .

పుష్పరాజ్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు . అసలు పుష్ప 2 సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఉందా..? లేదా ..? పుష్ప 2 సినిమాలో ఎందుకు అమ్మవారి గెటప్ లో కనిపిస్తున్నారు..? ఎందుకు పుష్ప2 లో నెయిల్ పెంచుకున్నారు . రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోని సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ జనాల్లో నెలకొంది . జనాల నాడిని పట్టి సినిమాను తెరకెక్కించే సుకుమార్ పుష్ప2ను కూడా అదే విధంగా తెరకెక్కించాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఏ భాషలో ఎక్కువ జనాలు చూశారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టీజర్ తెలుగులో – మలయాళం లో – కన్నడ – తమిళ్ – హిందీ భాషలలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . అయితే అన్ని భాషల్లో కల్లా ఈ టీజర్ ను ఎక్కువగా చూసింది మాత్రం హిందీలో . ఎస్ టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఎలా ఉందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు చెప్పితే పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతారు. అయితే టాలీవుడ్ – మలయాళం లో కాకుండా హిందీలో ఈ సినిమా ఈ టీజర్ ఎక్కువ వ్యూస్ తగ్గించుకోవడం బన్నీ క్రేజ్ కు మరొక విదర్శనంగా నిలిచింది . ఈ క్రమంలోనే రానున్న కాలంలో బన్నీ బాలీవుడ్ ఇండస్ట్రినీ ఏలేయడం పక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే పుష్పరాజ్ తీసుకున్న డెసిషన్ సూపర్ గా ఉంది అంటున్నారు జనాలు..!!