బొద్దుగా ఉన్నా ముద్దొచ్చేస్తున్న హనీ రోజ్.. సెగలు పుట్టిస్తున్న అమ్మడి బ్యూటీ పిక్స్..

వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ నటి ‘హనీ రోజ్’. ఈ తార తన ఫస్ట్ తెలుగు మూవీతోనే అందరినీ తనని అభిమానులను చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ పాలరాతి సౌందర్యం చాలామంది హృదయాలను దోచేసింది. కాస్త బొద్దుగా ఉన్నా చందమామ లాంటి ఈ తార అందం, మిల్కీ స్కిన్ కుర్రవాళ్ళతోపాటు పెద్దవాళ్లను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది.

నిజానికి హనీ రోజ్‌ తెలుగులో గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి ఒకట్రెండు సినిమాల్లో నటించింది కానీ అమ్మడికి వాటి ద్వారా ఎలాంటి గుర్తింపు రాలేదు. వీర సింహారెడ్డి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడికి చాలా అవకాశాలు వస్తున్నాయి.

హనీ రోజ్ వీరసింహారెడ్డి మూవీలో మీనాక్షి రోల్ పోషించింది. ఈ పంచదార బొమ్మ కేరళ రాష్ట్రం, తొడుపుజాలో సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో జన్మించింది. 1991లో పుట్టిన ఈ నటి సినిమాల్లోకి అడుగుపెట్టకముందు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బీ.ఏ చేసింది.

హనీ రోజ్ మలయాళ మూవీ బాయ్ ఫ్రెండ్‌ (2005)తో తెరంగేట్రం చేసింది. 2012లో త్రివేండ్రం లాడ్జ్‌తో మలయాళ సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. కోలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. బుల్లితెరపై కూడా ఈ అందాల తార ఒక మెరుపు మెరిసింది. ఈ బబ్లీ గర్ల్ మరిన్ని తెలుగు సినిమాలో నటించాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే అధికారికంగా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏ తెలుగు సినిమా లేదు. కాగా ఈ తార నటనకు ఆస్కారం ఉన్న రోజు కోసం వేచి చూస్తూ ఉండొచ్చు.