సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోలు హీరోయిన్లు చాలా తక్కువ . అలా మాట్లాడితే ఎక్కడ ట్రోల్ చేస్తారో అన్న భయం చాలామందికి ఉంటుంది . మరికొందరికి డైరెక్టర్స్ ఎక్కడ అవకాశాలు ఇవ్వరో అన్న టెన్షన్ ఉంటుంది . ఈ క్రమంలోనే మనసులో ఏదో ఉన్నా కానీ బయటకు అది చెప్పకుండా మరోలా మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెట్టుకు వస్తూ ఉంటారు హీరోలు హీరోయిన్లు వాళల్లో స్టార్స్ కూడా ఉంటారు . అయితే శృతిహాసన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది.
పేరుకి స్టార్ డాటర్ అయినా సరే తన తండ్రి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం ఉపయోగించుకోవడానికి ఇష్టపడిన శృతిహాసన్ .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . పర్సనల్గా తీసుకున్న డెసిషన్ కారణంగా ట్రోల్ అవుతున్న .. సరే ఏం మాత్రం బెదరకుండా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకోవడానికి ట్రై చేస్తుంది . రీసెంట్ గానే వీర సింహారెడ్డి – వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి హిట్లు అందుకున్న శృతిహాసన్ కి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఘాటు ప్రశ్న ఎదురయింది.
“మీకంటే వయసులో డబల్ ఏజ్ ఉన్న హీరోలతో నటించడం మీకు ఇబ్బందిగా లేదా ..?” అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ శృతిహాసన్ ..”మనలో టాలెంట్ ఉండాలి. అంతేకానీ వయసుతో సంబంధం ఏంటి .. నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను .. ఎదుట ఉన్న వాళ్ళు నటనలో ఎంత మంచిగా ప్రావీణ్యం పొందిన వారైతే.. నాకు అంత బెస్ట్ ..నేను అంతగా నటన నేర్చుకోగలను .. ఆ విషయంలో బాలకృష్ణ గారు చిరంజీవి గారు నెంబర్ వన్ .. వాళ్ళిద్దరి లాంటి హీరోలతో నటించడం నాకు నిజంగా గర్వకారణం .. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శృతి మాటలను కొందరు తప్పుగా పోట్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు..!!