ప్రభాస్ కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన అనుష్క..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అతను రాముడి పాత్ర చేస్తున్న ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్టు కే రాజా డీలక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభాస్ నుంచి రెండు, మరో సంవత్సరం ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ నాలుగు సినిమాలే కాకుండా ప్రభాస్ ఇంకొక సినిమా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సినీ సర్కిల్లో టాక్. ఆ సినిమాను డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్నట్లు సమాచారం. కథ నచ్చడంతో సినిమా తీసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనుష్క రీసెంట్ టైమ్స్ లో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తోంది. కాస్త లావు కూడా ఎక్కింది. కొన్ని నెలల క్రితం ఈ తార ఫొటోలు వైరల్ కాగా అందులో చాలా బొద్దుగా కనిపించింది.

జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టికి జంటగా అనుష్క ప్రస్తుతం ఒక సినిమా చేస్తోంది. అసలు ఆమె గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలను గమనిస్తే అన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేసుకుంటూ పోతోంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఆమె అనారోగ్యాలే కారణంగా చూపుతున్నారు. కాగా ఆమె ప్రభాస్ సినిమాలో ఆఫర్ రాగానే అందులో నటించేందుకు ఒప్పుకుందని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.