స‌మంత గ్యారేజ్‌లో ఎన్ని ఖ‌రీదైన కార్లు ఉన్నాయో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

సుధీర్గకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న అందాల భామ స‌మంత పుట్టిన‌రోజు నేడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన స‌మంత‌ 36వ ఏట అడుగుపెట్టారు. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

స‌మంత బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌మంత కార్ల క‌లెక్ష‌న్ గురించి ఓ న్యూస్ వైర‌ల్ అవుతున్నారు. సాధార‌ణంగా సినీ తార‌ల‌కు కార్లంటే మ‌క్కువ ఎక్కువ‌. ఈ జాబితాలో స‌మంత కూడా ఒక‌టి.

సమంత గ్యారేజ్‌లో పలు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆ కార్ల ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌బ‌డెతారు. స‌మంత గ‌తంలో ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. అత్యంత సౌక‌ర్యంగా మ‌రియు విలాసంగా ఉంటే ఈ కారు ధ‌ర రూ. 2.26 కోట్లు. అలాగే రూ. 1.46 కోర్ల విలువైన పోర్షే కేమాన్ జిటిఎస్, రూ. 72 లక్షల విలువైన జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రూ. 87 లక్షలు ఖ‌రీదు చేసే ఆడి క్యూ7, లాంటి కార్లు స‌మంత గ్యారేజ్ లో కొలువుదీరాయి. కాగా, స‌మంత ప్ర‌స్తుతం ఖుషి సినిమాతో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ను పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. ఈ రెండు ప్రాజెక్ట్ లు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.