`విరూపాక్ష` మూవీతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, సునీల్, శ్యామల, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.
టాక్ అనుకూలంగా ఉండటం, పోటీగా ఏ సినిమా లేకపోవడంతో విరూపాక్ష బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది. తాజాగా వారం రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.11 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 31.66 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా విరూపాక్ష ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 11.11 కోట్లు
సీడెడ్: 3.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.24 కోట్లు
తూర్పు: 1.76 కోట్లు
పశ్చిమ: 1.23 కోట్లు
గుంటూరు: 1.69 కోట్లు
కృష్ణ: 1.63 కోట్లు
నెల్లూరు: 0.80 కోట్లు
——————————————–
ఏపీ+తెలంగాణ= 25.11 కోట్లు(43.40 కోట్లు~ గ్రాస్)
——————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.20 కోట్లు
ఓవర్సీస్ – 4.35 కోట్లు
—————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ = 31.66 కోట్లు(57.20 కోట్లు~ గ్రాస్)
—————————————————-
కాగా, రూ. 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విరూపాక్ష.. ఇప్పటికే టార్గెట్ ను దాటేసింది. ప్రస్తుతం రూ. 8.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది.