మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అవగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రియను సెలెక్ట్ చేశారని రీసెంట్ గా పలు వార్తలు బయటకు వచ్చాయి. శ్రియ కూడా చిరుతో కలిసి ఆడడానికి ఒప్పుకుంది. ఇక్కడే ఓ చిన్న మెలిక పెట్టింది దాంతో.. దాంతో ఈ సినిమా యూనిట్ ఇప్పుడు విలువల్లాడిపోతుంది. భోళాశంకర్ లో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేందుకు ఏకంగా కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసిందట శ్రియ.
ఇంత మొత్తం రెమ్యూనరేషన్ కొందరు హీరోయిన్లు తమ సినిమాలకే తీసుకుంటున్నారు.. అలాంటిది శ్రియ ఒక పాట కోసం అంత మొత్తం డిమాండ్ చేయడంతో యూనిట్ ఒక్కసారిగా కంగుతుంది. నిజానికి 20-25 లక్షల్లో శ్రియాను సెట్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. ఓ ఐటమ్ సాంగ్‌కు అంతకుమించి రెమ్యూనిరేషన్ ఇస్తే చాలా ఎక్కువ.. కానీ ఒకేసారి కోటి రూపాయలు డిమాండ్ చేసి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చింది ఈ సీనియర్ హీరోయిన్.
స్టార్ హీరోయన్లు అయిన పూజాహెగ్డే, సమంత లాంటి వారు ఐటెంసాంగ్ చేసినప్పుడు ఇలా భారీగా ఛార్జ్ చేస్తుంటారు. పుష్పలో ఐటెంసాంగ్ కోసం సమంత, ఎఫ్3లో స్పెషల్ సాంగ్ కోసం పూజాహెగ్డే కాస్త ఎక్కువ తీసుకున్నారు. అంత క్రేజ్ లేని శ్రియ ఇంత డిమాండ్ చేస్తుందని చిత్ర యూనిట్ కలలో కూడా ఊహించలేదు. మరి శ్రియ చెప్పిన రేటు ఎంతకు తెగుతుందో చూడాలి మరి.