సినిమాలకు దూరమైన ఈ దగ్గుబాటి హీరో ఎవ‌రు… అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడో తెలుసా..!

చిత్ర పరిశ్రమలోకి వ‌చ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక నటించిన సినిమాలు ప్లాప్ అవడంతో చిత్ర పరిశ్రమకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఓ హీరో కూడా ఉన్నాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉన్నట్టుండి చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? అనే వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

ఆ కారణంతో సినిమాలకు దూరమైన దగ్గుబాటి రాజా | Where Is Daggubati Raja Now Interesting Facts About Daggubati Raja, Daggubati Raja, Daggubati Ramanaidu,venkatesh, Daggubati Suresh, About Daggubati Raja, Daggubati Raja ...

ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది ప్రొడ్యూసర్లుగా, హీరోలుగా పరిశ్రమలో రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వెంకటేష్, రానా ఇప్పటికే హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా అహింస‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు హీరోలుగా పరిచయం అయింది కేవలం వీరు మాత్రమే కాకుండా మరొక వ్యక్తి కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు.

 Daggubati Raja Personal And Professional Life Interesting Details-TeluguStop.com

ఆ హీరో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత కాలంలో కనుమరుగయ్యారు. ఆ హీరో మరి ఎవరో కాదు దగ్గుబాటి రాజా.. ఒకప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా తమిళ, మలయాళ, సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజాకి దగ్గుబాటి కుటుంబానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! మూవీ మొగల్ రామనాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా.. దర్శకుడు భారతి రాజా దగ్గర నటనలో శిక్షణ తీసుకుని హీరోగా పరిచయం అయ్యాడు.

Telugu Chennai, Daggubati Raja, Daggupati, Rana, Tollywood, Venkatesh-Movie

తమిళంలో వరస సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడగానే ఆకట్టుకునే రూపం దగ్గుబాటి వారసుల సొంతం. ఇక దాంతో రాజా స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వంటి పలు సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు దూరమయ్యాడు.

Telugu Chennai, Daggubati Raja, Daggupati, Rana, Tollywood, Venkatesh-Movie

మళ్లీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ సోదరుడు పాత్రలో నటించాడు రాజా. అయితే రాజాకు ఉన్న మొహమాటం వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అనీ అంటారు. ప్రసుత్తం వ్యాపారంలో రాణిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు రాజా.