చిత్ర పరిశ్రమకు చాలామంది నటులు తమ తొలి సినిమాతోనే తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టి స్టార్ హీరోలుగా ఎదుగుతారు. ఇక అలాంటి వారిలో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. చిత్రం మూవీ తో ఎంట్రీ ఇచ్చి.. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత వరుసుగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.. అలా ఇండస్ట్రీకి పరిచయం అవటంతోనే వరుసగా మూడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు ఉదయ్ కిరణ్.
ఇక దాంతో చాలామంది అగ్ర దర్శకులు, నిర్మాతలు ఉదయ్ కిరణ్‌తో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసి ఎప్పటికైనా స్టార్ హీరో అవుతాడనే ఉద్దేశంతో తన పెద్ద కూతురు సుష్మితని ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇదే విషయాన్ని ఉదయ్ కిరణ్ కి చెప్పటంతో ఆయన కూడా ఒప్పుకున్నాడట. ఎప్పుడైతే వీరి పెళ్లి గురించి చిత్ర పరిశ్రమలో వార్తలు బయటికి వచ్చాయో అప్పటినుంచి సుష్మిత- ఉదయ్ కిరణ్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్టీలకు, వెకేషన్స్ అంటూ తిరగటం మొదలుపెట్టారట.
ఆ విధంగా పెళ్లికి ముందే ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారట. కానీ ఎంగేజ్మెంట్ కు కొన్ని రోజులు ముందు కొంతమంది మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్లు సుష్మిత గురించి ఉదయ్ కిరణ్ కి తప్పుడు విషయాలు చేరవేశారట. సుష్మిత కి చాలామంది అబ్బాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఉదయ్ కిరణ్ కి చెప్పడంతో వారి మాటలు నిజమే అని నమ్మి ఉదయ్ కిరణ్- చిరంజీవి దగ్గరికి వెళ్లి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పారట.
మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు.. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని చెప్పడంతో.. ఈ విషయం పై చిరంజీవి మాత్రం మనం ఎదిగే టైంలో చాలామంది మనపై విమర్శలు చేస్తారు అలాంటివి పట్టించుకోకూడదు అని చెప్పినా కూడా ఉదయ్ కిరణ్ అసలు వినిపించుకోకుండా చిరంజీవికి అల్లుడయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడని అంటారు.