అందరి మెగా హీరోలల్లోకి ..చిరంజీవికి ఆయన అంటేనే ఎక్కువ ఇష్టం..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో అంతకు సగానికి పైగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద గగనంగా ఉన్న ఆ రోజుల్లో.. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ హీరోగా.. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ గా మారిపోయి .. ప్రెసెంట్ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి.

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోస్ పరిస్ధితి ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. వాళ్లలో అందరూ సక్సెస్ అయ్యారా..? అంటే కాదనే చెప్పాలి . కొందరు ఫెయిల్ అయ్యారని కూడా చెప్పాలి. అయితే కచ్చితంగా ఇండస్ట్రీలో ఒక్క క్రేజీ స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఇంతమంది మెగా హీరోలు ఉన్నా చిరంజీవికి ఏ హీరో అంటే ఇష్టం అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది .

అయితే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో బోలెడు మంది హీరోలు ఉన్నా.. మెగాస్టార్ చిరంజీవికి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అంటే చాలా ఇష్టమని ..చరణ్ కంటే ఎక్కువగా ఇష్టమంటూ కూడా ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి వరుణ్ తేజ్ చాలా సైలెంట్ క్యారెక్టర్ అని ..ఎక్కడ ఎలా ఉండాలో ..ఎక్కడ ఎలా నెగ్గాలో ..ఎక్కడ తగ్గాలో తెలిసిన పర్సన్ అని ..అందరు హీరోలు ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చేస్తూ ఉంటారు.. కానీ వరుణ్ తేజ్ మాత్రం.. రియల్ హీరోగా సినిమాలు చేస్తూ ఉంటాడు. నటన పరంగా మెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు . ఇప్పటివరకు వరుణ్ తేజ్ చేసిన సినిమాలన్నీ చూస్తే అదే అర్థమవుతుంది ” అంటూ చెప్పకొచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి రియల్ హీరో అని..ఉన్నది ఉన్నట్లు చెప్పుకొస్తాడని న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!