రష్మిక రేంజ్ పడిపోయిందనే వారికి.. గట్టి కౌంటర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రైస్ట్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతోపాటు తనకు సంబంధించిన పలు విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ,కోలీవుడ్ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇప్పుడు తాజాగా IMBD భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేయడం జరిగింది.

National crush Rashmika spreads in front of Indian women cricketers in  beauty
IMBD టాప్ టెన్ జాబితాను విడుదల చేయగా ఇందులో మోస్ట్ క్రేజీ సెలబ్రెటీగా హీరోయిన్ రష్మిక మూడవ స్థానంలో నిలిచింది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే రష్మిక పుష్ప -2 సినిమా అప్డేట్ ..ఈమె బర్తడే రెండు కలిసి రావడంతో ఈమె పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపించింది. ఇలా ట్రెండ్ అవుతున్న కారణంగా టాప్ త్రీ ప్లేసులో చోటు దక్కించుకుంది రష్మీక. పుష్ప-2 చిత్రంతోపాటు నితిన్ సరసన ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ఒక ఫోటో కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.

బాలీవుడ్ లో కూడా డైరెక్టర్ సందీప్ వంగాతో యానిమల్ అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం తన గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది రష్మిక. ఇటీవలే ఐపిఎల్ ప్రారంభోత్సవంలో తమన్నా ,రష్మిక ఇద్దరు కూడా అక్కడ మెరవడం జరిగింది. ఇలా ఒకవైపు సినిమాలలో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గడచిన కొన్ని నెలల నుంచి రష్మిక క్రేజ్ పడిపోయిందని వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉన్నాయని కొంతమంది నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. ఇలాంటి వారికి ఇది గట్టి కౌంటర్ అని చెప్పవచ్చు.