బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలె ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో మూడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న కియారా.. ఫైనల్ గా అతడితో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఆర్ ఖాన్ కియారాపై పలు ఆరోపణలు చేశాడు.
కియారా-సిద్ధార్థ్ హడావుడిగా పెళ్లి చేసుకోవడానికి ఆమె గర్భం దాల్చడమే కారణం అంటూ ఆయన ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అలియా భట్ మాదిరిగానే కియారా అద్వానీ గర్భం దాల్చాక వివాహం చేసుకుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా కియారాను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు టార్గెట్ చేసి షాకింగ్ ట్వీట్ వదిలాడు.
`పిల్లల్ని కనడం ఇష్టం లేని కియారా అద్వానీ అబార్షన్ చేయించుకుంది. ఆమెకు కెరీరే ముఖ్యం. స్వార్థపరురాలు` అంటూ.. దారుణమైన ఆరోపణలు చేశాడు. దీంతో కొందరు నెటిజన్లు ఛీ.. ఛీ.. కియారా అంతకు తెగించిందా అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఈ ట్వీట్ విషయంలో ఉమైర్ సంధుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈయన తరచూ సెలబ్రిటీలపై తీవ్ర పదజాలంతో వరుస ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. హీరో, హీరోయిన్స్ కి ఎఫైర్స్ అంటగడుతూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇప్పుడు కూడా పాపులర్ అవ్వడం కోసమే కియారాపై ట్విట్ చేశాడని ఉమైర్‌పై ఫైర్ అవుతున్నారు.