ర‌ష్మిక‌కు బ్రేక‌ప్‌.. పెళ్లైన హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త ప్రేమాయ‌ణం!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, రష్మిక తాము ప్రేమలో లేమ‌ని, తమ మధ్య మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ జోడీ పై లవ్ ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక కు బ్రేకప్ చెప్పి మరో హీరోయిన్ తో ప్రేమాయణం మొదలుపెట్టాడట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సమంత. ఈ బ్యూటీకి ఆల్రెడీ నాగచైతన్య తో పెళ్లై.. విడాకులు అయ్యాయి. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత విజయ్ దేవరకొండకు మనసు ఇచ్చిందట. వీరిద్దరూ `ఖుషి` సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తాజాగా ఓ ట్వీట్ చేశాడు. `రష్మిక మందానకు బ్రేకప్ చెప్పిన విజయ్ దేవరకొండ సమంతకు దగ్గరయ్యాడు. ఖుషి మూవీ సెట్స్ లో ఇద్దరికీ ఎఫైర్ మొదలైంది. ఈ మూవీ షూట్ కోసం శ్రీనగర్ వెళ్లిన విజయ్ దేవరకొండ-సమంత ఒకే హోటల్ రూమ్ లో ఉన్నారు. వీరిది జస్ట్ టైం పాస్ లవ్ అంటూ` అంటూ త‌న ట్వీట్‌లో దారుణ ఆరోపణలు చేశారు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఎఫైర్ వార్త‌లు ఊపందుకున్నాయి.

Share post:

Latest