ప్రభాస్ తో పెళ్లి.. అంటూ చుక్కలు చూపించారంటన్న హీరోయిన్..!!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రభాస్ వివాహం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సరే వివాహం ఎప్పుడు అని అడిగితే సినిమా పూర్తయిన తర్వాత అంటూ ఐదు ఆరేళ్ల నుంచి ఇదే మాట చెప్పుకొస్తున్నారు ప్రభాస్. హీరోగా అతనితో నటించే హీరోయిన్స్ తో ప్రభాస్కు లవ్ ట్రాక్లు పెళ్లిళ్లు చేస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయాన్ని ప్రభాస్ కూడా చాలా లైట్ గానే తీసుకున్నారు. మరొక పక్క కృతి సనన్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కేవలం మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు ఫ్రెండ్షిప్ ఒకటే ఉందంటూ తెలియజేసింది. కొంతమంది స్నేహితులకూడా ప్రభాస్ తో పెళ్లెప్పుడు అంటూ తనకు మెసేజ్ చేస్తున్నారని తెలియజేస్తోంది. ఇక అన్ స్టాపబుల్ సోలో కూడా ప్రభాస్ కృతి సనన్ మ్యాటర్ గురించి ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది. అది చూసిన తర్వాత నిజంగానే ప్రభాస్ ,కృతి సనన్ మధ్య ఏదైనా ఉందేమో అనుకుంటారు ఆమధ్య కరణ్ జోహార్ షో లో కూడా వరుణ్ ధావన్ కూడా నీ లిస్టులో కృతి లేదు ఎందుకు అంటే మరొకరు హృదయంలో ఉంది.. దీపికాతో షూటింగ్లో అతను ఉన్నాడంటే తెలియజేశారు.

ఈ విషయంపై ప్రభాస్ ని కాల్ చేసి అడిగితే అవునా అతను అలా అన్నాడా అని ప్రభాస్ అన్నాడట. దీంతో ప్రభాస్ కి ఏం జరుగుతుందన్నది అసలు తెలియడం లేదట.కానీ ప్రభాస్ కృతి సనన్ క్లోజ్నెస్ చూసి మీడియా వీరిద్దరి మధ్య పలు రిలేషన్ ని సృష్టించినట్లు తెలుస్తోంది.

Share post:

Latest