బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్ లీక్ .. నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయంలో ఫ్యాన్స్..!?

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన క్రేజీ మూమెంట్ ..ఎట్టకేలకు ఫైనల్ గా రిలీజ్ అయింది . ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30..ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 సినిమాలకు కమిట్ అయ్యారు . అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వలేదు . ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అయితే ఓపిక నశించిపోయి ఎన్టీఆర్ నే డైరెక్ట్ గా అప్డేట్స్ కోసం టార్చర్ చేశారు. ఈ క్రమంలోని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అసహనానికి గురైన ఎన్టీఆర్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మేము ఇస్తామని అంతవరకు వెయిట్ చేయమని ఘాటుగానే స్పందించారు .

ఇంకా అప్పటినుంచి ఎన్టీఆర్ 30 సినిమాపై హోప్స్ వదులుకున్న ఫాన్స్ కి కొరటాల శివ ఊపిరి పోసినట్లయింది. రీసెంట్గా జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు . అంతేకాదు త్వరలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించబోతున్న మృణాల్ ఠాకూర్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ తెలుస్తుంది .ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన మరో బిగ్ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయబోయే ఎన్టీఆర్ థర్టీ సినిమాకు “దేవర” అనే టైటిల్ ఫిక్స్ చేశారట డైరెక్టర్ .

ఈ క్రమంలోని ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న కార్యక్రమంలో ఈ టైటిల్ లీక్ అయినట్లు తెలుస్తుంది . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సినిమాకి టైటిల్ దేవరా అని పెట్టడంలో ఎంత హ్యాపీగా ఉన్నారో.. సినిమా స్టార్టింగ్ లోనే ఇలా సోషల్ మీడియాలో లీకు రాయుళ్లు ఎన్టీఆర్ 30 సినిమాపై కన్నేయడంతో కూసింత డిసప్పాయింట్ అవుతున్నారు . ఇలా క్రేజీ న్యూస్లన్నీ సినిమా రిలీజ్ కి ముందు బయటికి వచ్చేస్తే ..ఎన్టీఆర్ 30 సినిమాకి మార్కెట్ డౌన్ అవుతుందని ..ఇప్పటికే సినిమాను సాగ తీసి తీసి కొరటాల సగం మార్కెట్ ని డౌన్ చేశారని.. ఇప్పుడు మరోసారి లీకు రాయళ్ళు ఈ విధంగా ఎన్టీఆర్ థర్టీ సినిమాపై ఫోకస్ చేసి.. ఆయన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ముందుగానే రిలీజ్ చేయడం ఏం బాగోలేదంటు చెప్పుకొస్తున్నారు.

దీంతో కొందరు నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ థర్టీ సినిమా బాగుందని నవ్వాలో.. లేక ఇలా లీక్ అయిపోయింది అంటూ ఏడవలో తెలియని అయోమయం స్థితిలో ఉన్నారు అంటూ పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ 30 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఒక టైటిల్ తోనే కన్ఫామ్ చేసేసాడు కొరటాల . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఏ రోజు ఇస్తాడో కొరటాల శివ..?