హైట్ తక్కువున్న నిత్య మీనన్ కి అది కూసింత ఎక్కువే.. అందుకే తెలుగు ఇండస్ట్రీ నుండి తరిమి కొట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా .. అందాల ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ అంటే అందరికీ కూసింత ఎక్కువగానే ఇష్టం ఉంటుంది . దానికి మెయిన్ రీజన్ అమ్మడు నాచురల్ గా నటిస్తుంది .. మేకప్ లేకుండా నటించడం నిత్యామీనన్ కి ఉన్న స్పెషల్ అట్రాక్షన్.. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది నిత్యామీనన్ .

కాగా రీసెంట్గా నిత్యామీనన్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళం లో వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్న నిత్యామీనన్ తెలుగులో ఎందుకు కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోని నిత్యామీనన్ కి కూసింత హెడ్ వెయిట్ అని ..ఉన్నది ఉన్నట్లు ముఖాన్ని మాట్లాడేస్తుందని ..ఈ కారణంగానే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఓ టాప్ మోస్ట్ డైరెక్టర్ తో గొడవలకు దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్గా భీమ్లా నాయక్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ తో కొన్ని ఇష్యూస్ ని క్రియేట్ చేసుకుందని.. ఈ క్రమంలోని అమ్మడుతో సినిమా అంటే తెలుగు మేకర్స్ భయపడిపోతున్నారని ..ఆ కారణంగానే ఇప్పటివరకు నిత్యామీనన్ తెలుగులో ఒక సినిమా కూడా సైన్ చేయలేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే కొందరు తెలుగు ఇండస్ట్రీ నుండి నిత్యామీనన్ అని తరిమి కొట్టేశారు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు..!!

Share post:

Latest