అద్గది.. చెన్నై బిడ్డ అంతే అలా నే ఉండాలి..కీర్తి సురేష్ డెసీషన్ మామూలుగా లేదుగా…!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంటే అంత ఈజీ మేటర్ కాదు. దాని వెనక ఎంతో కష్టం ..కృషి.. పట్టుదల.. తెగింపు.. త్యాగాలు ఉండాలి . కాగా అలాంటివన్నీ చేసిన తర్వాత హీరోయిన్గా అవకాశాలు వస్తే చేతినిండా డబ్బులు సంపాదించుకుంటారు అని అనుకోవడం అపోహే.. ఆ తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా మారడానికి ఎన్ని తలనొప్పులు పడ్డాలో ప్రజెంట్ ఇండస్ట్రీలో పడుతున్న హీరోయిన్స్ తిప్పలు చూస్తే అర్థమవుతుంది .

అయితే చాలామంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తెలుగులో ఆఫర్లు రాగానే ఆ పాపులారిటీతో బాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటారు. ఆ అవకాశం వస్తే చచ్చినా మిస్ చేసుకోరు . ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు అలాగే బాలీవుడ్ కి జంప్ అయిపోయారు. అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది మహానటి గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ . ఇప్పటికే అమ్మడికి బాలీవుడ్ లో ఏడు ఎనిమిది ఛాన్సులు వచ్చాయి. బాలీవుడ్ బడా హీరోలు అందరూ ఆమెతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అయినా ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాకి సైన్ చేయలేదు కీర్తి సురేష్. అంతేకాదు ఇకపై చేస్తుందన్న ఉద్దేశాలు ఎవరికీ లేవు . అంతలా తన మైండ్ ని ఫిక్స్ చేసేసుకుంది కీర్తి సురేష్ . టాలీవుడ్ లో ఉంటే తన లిమిట్స్ క్రాస్ చేయనని అదే బాలీవుడ్ కి వెళ్తే కచ్చితంగా లిమిట్స్ క్రాస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని తన ప్రవర్తన వల్ల తన తల్లిదండ్రులకు ఎటువంటి చెడ్డ పేరు రాకూడదన్న కారణంతోనే ఆమె బాలీవుడ్ కి వెళ్లడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో కీర్తి సురేష్ పేరు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . చెన్నై బిడ్డ అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . దీంతో కీర్తి సురేష్ పేరు మరోసారి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది..!!

Share post:

Latest