చిరు ఓవర్‌నైట్ స్టార్ కావడానికి ఆ ఒక్కరే కారణం.. మీరు అస్సలూహించరు!

ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించి ఆ తరువాత సుప్రీం సినిమాతో హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. సొంత కష్టం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారంటే దాని వెనకాల ఉన్న కష్టం అర్ధం అవుతుంది. అయితే చాలా మంది చిరంజీవి ఖైదీ సినిమాతోనే ఓవర్ నైట్ హీరో అయ్యారని అనుకుంటారు. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం చిరు ఇంత మంచి పేరు తెచ్చుకోడానికి విషయం వేరే ఉందని అంటున్నారు కొంతమంది.

అసలు విషయంలోకి వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ తరువాత సినిమా చేసిన హీరో ఎవరంటే అందరూ చిరంజీవి పేరే చెబుతారు. అయితే ఎన్టీఆర్ కి చిరంజీవి కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. చిరు సినిమాలకు ఎన్టీఆర్ గెస్ట్ గా కూడా హాజరైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కారణంగా ఒక్క సినిమా వల్ల చిరు స్టార్ హీరో అయిపోయారు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఒకేఒక సినిమా ‘అల్లుడా మజాకా’. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా రాలేదు. ఈ సినిమా ని 1994, ఆగస్టు 26 సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదగా ప్రారంభించారు.

అయితే మొదటి వేరే గెస్ట్‌ని పిలవాలని అనుకున్నారట కానీ నిర్మాత కే దేవి వరప్రసాద్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడం తో ఎన్టీఆర్ ని ఆహ్వానించారట. ఈ కార్యక్రమానికి కొంతమంది సిని ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ తరువాత 1995 ఫిబ్రవరి 25న విడుదల అయిన అల్లుడా మజాకా సినిమా ని చిరంజీవితో కలిసి ఎన్టీఆర్ కూడా చూశారట. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో చిరు ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.