అలాంటి చెత్త పని.. చేసి చివాట్లు తింటున్న రకుల్..!!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.అలా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు కూడా డేట్లు అడ్జస్ట్ చేయలేనీ బిజీలో ఉండేది. అలాంటి రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో కాస్త గడ్డుకాలం ఏర్పడిందని చెప్పవచ్చు. తెలుగు,తమిళ్ వంటి భాషలలో ఆఫర్లు లేకపోయినప్పటికీ ఈ అమ్మడుకు బాలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది.

కానీ అక్కడ ఘోరమైన ప్లాపులను చవిచూస్తూనే ఉంది. అక్కడ చేసిన సినిమాలన్నీ నిరాశపడడంతో దీంతో అక్కడ కూడా ఆఫర్లు రావడం తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేస్తున్న సినిమాలు ఏంటంటే టక్కున చెప్పలేరని చెప్పవచ్చు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా ఆన్లైన్ రమ్మీ ని ప్రమోట్ చేస్తూ దారుణమైన స్థితిలోకి పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కమర్షియల్ యాడ్ కు రకుల్ ప్రీతిసింగ్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh highlights the need for responsible gaming in A23's new  campaign - Exchange4media
అయినా కూడా ఇమే ను చాలామంది తప్పు పడుతున్నారు. ఆఫర్లు లేకపోతే ఇలాంటి పని చేయాలా.. ఈ ఆటను నిషేధిత చేయడం జరిగింది. ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ రమ్మీ వాటిని పలు రాష్ట్రాలలో బ్యాన్ చేయడం జరిగింది.కొన్ని రాష్ట్రాలలో మాత్రం దొంగచాటుగా ఆడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి యువతను బయటపడే విధంగా సెలబ్రెటీలు ప్రచారం చేయాలి కానీ వీటిని ప్రోత్సహించడం ఏమాత్రం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.