బికినీకి అన్ని కోట్లు అడిగిందా..? న‌య‌న్ కు దండం పెట్టాల్సిందే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామ‌ర్ రోల్స్ చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. కానీ, స్టార్డ‌మ్ వ‌చ్చాక అన్నిటినీ బంద్ చేసింది. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది.

అలాంటి న‌య‌న‌తార ఇప్పుడు బికినీ వేసేందుకు ఒప్పుకుంద‌ట‌. ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే `జ‌వాన్‌` అనే మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ అట్లీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్‌ భార్య గౌరీఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలో న‌య‌న్ బికినీలో క‌నిపించ‌బోతుంద‌ట‌.

సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. స్టోరీ డిమాండ్ మేరకు ఇప్పుడు న‌య‌న‌తారను సైతం బికినీ షోకు ఒప్పించార‌ట మేక‌ర్స్‌. అయితే బికినీ వేసేందుకు న‌య‌న్ ఎంత డిమాండ్ చేసిందో తెలిస్తే దండం పెట్టేస్తారు. ఎందుకంటే, మామూలుగా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే న‌య‌న‌తార‌.. జ‌వాన్ లో బికినీ వేసేందుకు ఏకంగా రూ. 10 కోట్లు అడిగింద‌ట‌. ఆమె డిమాండ్ కు మొద‌ట షాకైన నిర్మాత‌లు.. ఆ త‌ర్వాత అంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ని ఇన్‌సైడ్ టాక్. ఇక పెళ్లై పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత న‌య‌న్ బికినీ వేసేందుకు ఒప్పుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.