ఇంత మోస‌మా..? మాట త‌ప్పినందుకు మండిప‌డ్డ‌ సంయుక్త!

భీమ్లానాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష‌` సినిమాలో న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. అయితే నిన్న ఉగాది పండుగ సంద‌ర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ జీప్‌పై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న పోస్ట‌ర్ ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వదిలారు. సంయుక్త మీనన్ లుక్ కి సంబంధించిన ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. దీంతో సంయుక్త బాగా హ‌ర్డ్ అయింది.

ఇంత మోసమా అంటూ విరూపాక్ష మూవీ టీమ్ పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. `నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను.. నా నిరాశని వ్యక్తం చేసే ముందు.. విరూపాక్ష చిత్రంలో గొప్ప నటులు, టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. కానీ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంది? నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాది రోజు రిలీజ్ చేస్తారని మాట ఇచ్చారు.. ఆ పోస్టర్ ఏది?` అంటూ మాట త‌ప్పినందుకు మండిప‌డింది. దీంతో దిగొచ్చిన చిత్ర టీమ్‌.. సంయుక్త‌కు క్షమాపణలు చెప్పింది. అలాగే పోస్టర్ రిలీజ్ చేసేందుకు కొంత సమయం ఇవ్వమ‌ని కోరింది.

https://twitter.com/iamsamyuktha_/status/1638527383434309632?s=20