తన తండ్రి పడ్డ కష్టాలను వివరించిన కమెడియన్ లక్ష్మీపతి కూతురు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు నటుడు లక్ష్మీపతి. బాబి, అల్లరి ,మురారి, నీ స్నేహం, తొట్టి గ్యాంగ్, కితకితలు తదితర చిత్రాలలో నటించారు లక్ష్మీపతి. దాదాపుగా 40 చిత్రాలలో నటించిన ఈయన సునీల్తో కలిసి చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. లక్ష్మీపతి అన్న శోభన్ కూడా ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్.. మహేష్ బాబుతో బాబి, ప్రభాస్ తో వర్షం సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. వీరిద్దరూ అన్నదమ్ములన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Tollywood Comedian Lakshmipati Biography, News, Photos, Videos | NETTV4U
వీరిద్దరూ మరణం లో కూడా కేవలం ఒక్క నెల వ్యవధిలోనే మరణించి అప్పట్లో పెను సంచలనానికి దారితీసింది. తాజాగా లక్ష్మీపతి కూతురు శ్వేతా లక్ష్మీపతి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సినిమాలను తీసే క్రమంలో ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారని రెండు థియేటర్లు కూడా అమ్మేశారని కొన్నాళ్లకు తన బాబాయ్ కనిపించలేదు. ఆ తర్వాత ఒక లెటర్ వచ్చింది అందులో ఒకచోట చాలా క్షేమంగా ఉన్నానని రాసి డబ్బులు పంపించారు.. అయితే అది తన పుట్టినరోజు ముందు గిఫ్ట్ అని తెలిపింది ఆయన డైరెక్టర్ గా పనిచేసిన మొదటి చిత్రం బాబీ ప్లాప్ కావడంతో కుటుంబం పైన చాలా దెబ్బ పడిందని తెలిపింది.

ఆ తర్వాత చాలా కసితో వర్షం సినిమాని తీశామని అది సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత చంటి సినిమా ఫెయిల్యూర్ గా నిలవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.. అలా బాబాయ్ చనిపోయారు నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నా ఫోన్ పనిచేయలేదు రాత్రి తొమ్మిది గంటలకు ఆఫీస్ ఫ్రెండ్స్ తన ఫ్లాట్ కొచ్చి ఈ విషయాన్ని చెప్పారని తెలిపింది. తన అన్న లేడని విషయాన్ని తన తండ్రి తట్టుకోలేక ప్రతిరోజు తాగే వారట ఆ కోపంతో నాన్నతో ఎక్కువ రోజులు మాట్లాడలేదని తెలిపింది శ్వేత. ఆ డిప్రెషన్ లోనే తన తండ్రి కూడ మరణించారని తెలిపింది.

Share post:

Latest