కొత్త ఇంట్లో చైతు ఉగాది పండుగ‌.. ఫ‌స్ట్ గెస్ట్ గా ఎవ‌రూ ఊహించ‌ని వ్య‌క్తి!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ఇటీవ‌ల‌ తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాసంగా మ‌రియు సుంద‌రంగా కొత్త ఇంటిని క‌ట్టించుకున్నార‌ట‌. నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇవ్వక ముందు జూబ్లీహిల్స్‌లో నివసించేవాడు. వారు విడిపోయాక కొన్ని నెలలపాటు తన తండ్రి నాగార్జున‌ ఇంట్లో ఉన్నాడు. తర్వాత హోటల్‌కు మారాడు.

గ‌త వారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేశాడు. నిన్న ఉగాది పండుగ‌ను చైతు త‌న కొత్త ఇంట్లోనే జ‌రుపుకున్నాడు. ఇక పండ‌గ పూట చైతు ఇంటికి ఓ ఊహించ‌ని వ్య‌క్తి అతిథిగా వెళ్లాడు. అతనెవరో కాదు రీసెంట్ గా `కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ చందూ ముండేటి. చైతు కొత్త ఇంట్లో అడుగు పెట్టిన ఫ‌స్ట్ గెస్ట్ ఈయ‌నే అట‌. నాగ చైతన్య కొత్త ఇంటిని విజిట్ చేయడంపై చందూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

`ఉగాది రోజు యువసామ్రాట్ కొత్త ఇంట్లో.. మొదటి అతిథిని నేనే .. కంగ్రాట్స్ నాగ చైతన్య` అని చందూ ఆయ‌న‌తో దిగిన ఓ పిక్ ను పోస్ట్ చేశాడు. కాగా, చందూ ముండేటికి, నాగ చైతన్యకి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సవ్యసాచి అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ నిరాశపరిచినప్పటికీ వీరిద్ద‌రి మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. మ‌రి ఆ ఫ్రెండ్ షిప్ తో చందూ చైతు ఇంటికి వెళ్లాడా..? లేక ఏదైనా క‌థ చెప్ప‌డం కోసం వెళ్లాడా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/CqFkvmArHk-/?utm_source=ig_web_copy_link

Share post:

Latest