అలా పిలిస్తే చాలా చిరాకు.. నాని అంత మాట‌న్నాడేంటి..?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషితో ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో నాని ఒక‌డు. ఆయ‌న్ను అభిమానులు ముద్దుగా న్యాచుర‌ల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఫ్యాన్స్ ప్రేమ‌తో నానికి ఇచ్చిన ట్యాగ్ అది. కానీ, నాని మాత్రం న్యాచుర‌ల్ స్టార్ అని పిలిస్తే త‌న‌కు చాలా చిరాకు అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నాని `ద‌స‌రా` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నాని.. `న్యాచుర‌ల్ స్టార్ అనే ట్యాగ్ నాకు ఇష్టం లేదు. ఇక‌పై అలా పిల‌వ‌కండి. ఎందుకంటే, మ‌న పేరే మ‌న‌కు పెద్ద బ్రాండ్ అని నేను భావిస్తాను` అని పేర్కొన్నాడు. ఇక ద‌స‌రాను శ్రీ‌కాంత్‌ ఎంతో శ్ర‌ద్ధ పెట్టి తీశాడ‌ని, ఈ సినిమాతో త‌న‌కు మొత్తం సెట్ అయిపోతుంద‌ని న‌మ్ముతున్నా అంటూ నాని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ద‌స‌రా ఖ‌చ్చితంగా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని నాని ధీమా వ్య‌క్తం చేశాడు.