ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!

ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్‌గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్‌లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం.

Temper Movie Latest Updates!

ఎన్టీఆర్:
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాతో కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. ఆ తర్వాత కూడా కాజల్- ఎన్టీఆర్ తో మూడు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ -కాజల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో ఎన్టీఆర్‌కు కాజల్ లక్కీ హీరోయిన్గా కలిసి వచ్చింది.

Tamatina 'Ram Charan Teja and Kajal Aggarwal - Magadheera' Wall Poster  (Paper, 30.48 cm x 0.02 cm x 45.72 cm, Multicolor) : Amazon.in: Home &  Kitchen

రామ్ చరణ్:
చిరంజీవి న‌ట‌ వారసుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాలో రామ్ చరణ్ కు జంటగా నటించింది కాజల్.. ఈ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా కాజల్- రామ్ చరణ్ తో నాలుగు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. రామ్ చరణ్ కి కూడా కాజల్ లక్కీ హీరోయిన్గా కలిసి వచ్చింది.

prabhas: Breaking Stories and Article | BollywoodCharcha

ప్రభాస్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కృష్ణంరాజు నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌భాస్-కాజల్ జంట కూడా సూపర్ హిట్ జంట. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించిరు ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ కి కూడా కాజల్ లక్కీ హీరోయిన్గా మారింది. ఈ ముగ్గురి స్టార్ హీరోలకు కాజల్ లక్కీ హీరోయిన్గా కలిసి వచ్చింది.