ఆ మాట అనేసి..ప్రభాస్‌ పరువు ని నట్టేట్లో ముంచేసిన మంత్రి .. ఇవేం సెటైర్లు రా బాబు..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ సెలబ్రెటీస్ పై కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు కొందరు ప్రజలు . కేవలం కామన్ పీపుల్సే కాదు మంత్రులు స్టార్ సెలబ్రెటీస్ కూడా కొందరు పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసి కామెంట్ చేసి ఫన్నీ జోక్స్ వేసి వాళ్ళ పేరుని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే మంత్రి మల్లారెడ్డి స్టేజి ఎక్కి మైక్ పట్టుకున్నాడు అంటే స్పీచ్ అదిరిపోవాల్సింది. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఆయన నవ్వులు పూయిస్తూ ఉంటారు . కాగా రీసెంట్గా మల్లారెడ్డి..” మేం ఫేమస్ అనే సినిమా ఈవెంట్లో మెరిసారు. ఈ క్రమంలోనే స్టేజి పైకి ఎకి మైక్ పట్టుకున్న మల్లారెడ్డి తనదైన స్టైల్ లో రెచ్చిపోయి ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు . ఆదివారం జరిగిన ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మల్లారెడ్డి వచ్చారు. కాగా ఇందులో భాగంగానే సినిమా టైటిల్ కి తగ్గట్టుగా తన స్పీచ్ ని ఓ రేంజ్ లో ప్రసంగించి హంగామా చేశారు .

ఫేమస్ గురించి వివరిస్తూనే తాను ఇప్పుడు ఫేమస్ అని అందుకు కారణం కష్టపడి పైకి వచ్చానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మేం ఫేమస్ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ ని పొగుడుతూ ప్రభాస్ తో కంపేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు . అంతేనా సుమంత్ ప్రభాస్ ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకున్నందుకు అభినందించిన మంత్రి ..ఆయన చూడడానికి అచ్చం ప్రభాస్ కంటే అందంగా ఉన్నాడని తనదైన స్టైల్ లో ఆ కుర్ర హీరోని ఓ రేంజ్ లో పొగిడేసారు . “అంతేనా ప్రభాస్ అంటే బోళెడు మేకప్ వేసుకొని ఉంటాడు.. కానీ నువ్వు మేకప్ లేకుండా స్మార్ట్ గా ఉన్నావ్” అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యంగా కామెంట్ చేశాడు .

ఈ క్రమంలోని అక్కడ ఉన్న ఆడియన్స్ ఫాన్స్ హంగామా చేశారు. కాగా తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడు అంటూ ఓ రేంజ్ లో ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు . ఈవెంట్ వరకు అంతా బాగానే ఉన్నా కానీ మధ్యలో ప్రభాస్ ని డి గ్రేడ్ చేస్తూ మాట్లాడడమే రెబెల్ ఫాన్స్ కు నచ్చలేదు . ఈ క్రమంలోని ఈ రేంజ్ లో ప్రభాస్ ని ఆడుకున్నావ్ ఏంటయ్యా అంటూ కొందరు ఆయనను కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు రెబెల్ ఫ్యాన్స్ ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు . మా ప్రభాస్ అన్న మేకప్ లేకపోయినా బాగానే ఉంటాడు అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పై మల్లారెడ్డి చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!