ఆ హీరోయిన్ ప్రభాస్‌కు అంత పెద్ద దెబ్బ వేసిందా.. ఎవ్వ‌రికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలెవ‌ల్‌లోనే కాకుండా హాలీవుడ్ హీరోల స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కెరీర్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కు తొలి అడుగులోనే యావరేజ్ హిట్ దక్కింది.

Prabhas Net Worth 2023: Movie Income Career Age Assets Wifeప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్ర డిజాస్టర్ గా నిలిచి ప్రభాస్ కు షాక్ ఇచ్చింది. అయితే వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న‌ ప్రభాస్‌కు అదే ఏడాది విడుదలైన అడవి రాముడు సినిమాతో షాక్ తగిలింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంట‌గా ఆర్తి అగర్వాల్ నటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజ‌య‌ని అందుకోలేదు. అయితే ఈ సినిమా ఆర్తి అగర్వాల్ వల్లే ఫ్లాపైందని చాలామంది నమ్ముతారు.

ఈ సినిమా షూటింగ్‌ సమయానికి ఆర్తి అగర్వాల్ షేపులు మారిపోవడంతో సినిమాలో ఆర్తి అగర్వాల్ బొద్దుగా కనిపించారు. దర్శకనిర్మాతలకు సైతం ఈ విషయం తెలిసినా షూటింగ్‌ కు చాలారోజుల ముందే ఆమెను ఫిక్స్ చేయడం వల్ల షూటింగ్ సమయానికి ఆమె లుక్స్ మారిపోవడంతో ఏం చేయలేకపోయారు. ఆర్తి అగర్వాల్ వల్లే కథ, కథనం బాగున్నా అడవిరాముడు సినిమా హిట్ అవ‌డంలో ఫెయిలైంది.

అడవిరాముడు మూవీ కూడా హిట్టై ఉండి ఉంటే ఆ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగి ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవడం వల్ల నిర్మాతకు నష్టాలు వచ్చాయని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరైన కథలను ఎంచుకోలేకపోవడం ప్రభాస్‌కు కొన్నిసార్లు మైనస్ అవుతోంది. బాహుబలి2 సినిమా తర్వాత వరుస ఫ్లాపులు ప్రభాస్‌కు భారీ షాకిచ్చాయి.

కథల ఎంపికలో ప్రభాస్ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపైనే ప్రభాస్ ఆశలు పెట్టకోగా ఈ సినిమాలు ప్రభాస్ నమ్మకాన్ని నిజం చేస్తాయేమో లేదో చూడాలి. ప్రభాస్ ను నమ్మి నిర్మాతలు నిర్మిస్తున్న భవిష్యత్తు ప్రాజెక్ట్ ల బడ్జెట్ ఏకంగా కోన్ని వేల‌ కోట్ల రూపాయలు అని సమాచారం. ప్రభాస్ సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.