విశ్వక్‌సేన్ దాస్ కా ధ‌మ్కీ ప్లేస్‌లో ర‌వితేజ ధ‌మాకా… థియేట‌ర్ల‌లో గగ్గోలు పెడుతోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్, నివేదపేత్ రాజ్ జంటగా నటించిన మూవీ దాస్ కా ధమ్కీ.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లో విడుదలైన మొదటి రోజునే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాలను చూస్తున్నారు.

విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. ఇదిలా వైజాగ్ లొని సుకన్య థియేటర్లో ధ‌మ్కీకి బదులు ధమాకాను వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన ధమాకా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

 Instead Of Threats, The Theater Management Showed Dhamaka The Fans Are Gagging-TeluguStop.com

ఇక ధమ్కీకు బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందించగా.. ధమాకాకు కూడా బెజవాడ ప్రసన్న కుమారే కథను అందించారు. ఇక ధమాకా థియేటర్స్ లో ప్రత్యేక్షం అవ్వడంతో ప్రేక్షకులు ఒక‌సారిగా షాక్ అయ్యారు. ఓరి బాబోయ్ ధమాకా కాదురా.. మాతిపోయిందారా ధమ్కీ రా బాబు అని అరిచి గోల చేశారు. చూసినవాళ్లందరూ కూడా తెగ నవ్వుకుంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లు హీరోలు కూడా ద్విపాత్రాభినయంలో నటించడం గమనార్హం. మరి ఈ ఘటనపై హీరో విశ్వక్ ఎలా స్పందిస్తారో చూడాలి.