వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు.
ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు.

Nandamuri Balakrishna says 'Babbai loved me more than his own kids' after  controversy over ANR comment - India Today

ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన 108వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని కూడా ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉంటే ఒకప్పుడు బాలయ్య చేయాల్సిన చాలా సినిమాలు కూడా వేరే హీరోలు చేసి సూపర్ హిట్‌లు అందుకున్నారు.

Telugu Anjali Jazeri, Balakrishna, Jayanth Paranji, Tollywood, Venkatesh-Movie

అలా బాలకృష్ణ మిస్ చేసుకున్న ఓ సూపర్ హిట్ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విక్టరీ వెంకటేష్ హీరోగా అంజలా ఝ‌వేరి హీరోయిన్‌గా వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా ప్రేమ, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ జయంత్ సీ ప‌రాంజీ ముందుగా ఈ సినిమాని బాలకృష్ణతో చేయాలని భావించారట.

Telugu Anjali Jazeri, Balakrishna, Jayanth Paranji, Tollywood, Venkatesh-Movie

ఈ సినిమా కథను కూడా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే రాశారట. అది అనుకోకుండా వెంకటేష్ దగ్గరికి వెళ్ళింది. వెంకటేష్‌కు కథ నచ్చడంతో ఆయనతో ఈ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ఈ దర్శకుడు. అలా బాలయ్య బాబుతో చేయాల్సిన ఈ సినిమా వెంకటేష్‌కు వెళ్ళింది. ఈ విధంగా బాలయ్య ఈ సినిమాని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.