మరో అమ్మాయిని పట్టిన షణ్ముఖ్…. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడు..!!

యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ వీడియోలతోనే కాకుండా వెబ్ సీరిస్ లు, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తరువాత మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని రన్నరప్ గా నిలిచాడు. కానీ తన తోటి కంటెస్టెంట్ సిరి ప్రవర్తన వల్ల విమర్శలను ఎదుర్కొన్నాడు.

సిరి కారణంగానే షణ్ణు గేమ్ కాస్త వెనకబడిందని కొన్ని వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఆమె వల్ల షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పేసింది. షణ్ముఖ్ బీబీ హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత దీప్తి అతనితో విడిపోయిన విషయం సంచలనం సృష్టించింది.

ఇక షణ్ముఖ్ జస్వంత్ గత కొంతకాలంగా వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడు. ఈమధ్య యూట్యూబ్ నటి ఫణి పూజితతో కలిసి యూట్యూబ్ వీడియోలు తీస్తున్నాడు. ప్రస్తుతం వీరి రొమాంటిక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా వీరి జంట చర్చనీయాంశంగా మారుతుంది. షణ్ముఖ్‌కి ​​కొత్త ప్రేయసి దొరికిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పూజితతో షణ్ముఖ్ రొమాంటిక్ సాంగ్స్ చేస్తున్నాడు. ఇటీవల షణ్ముఖ్ జస్వంత్, ఫణి పూజిత యూట్యూబ్ సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో షణ్ముఖ్- ఫణి పూజిత ఇద్దరూ ముద్దుపెట్టుకోవడం, గట్టిగా కౌగిలించుకోవడం వల్ల ఆ వీడియో బాగా వైరల్ అయింది. దీన్ని చూసే దీప్తి సునైనా ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు చేస్తున్న షణ్ముఖ్ ఇకపై దీప్తితో కలిసి మాట్లాడే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు.