తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఫ్యామిలీలో మొదటి తరం హీరో నాగేశ్వరరావు తర్వాత రెండో తరం హీరో నాగార్జున కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోలకు అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇది ఇలా ఉంచితే తెలుగులో నవ మన్మధుడిగా అక్కినేని నాగార్జునకు పేరు ఉంది. మళ్లీ ఈ ఫ్యామిలీలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌కే ఇలాంటి గుర్తింపు వస్తుంది అని అందరూ భావించారు.
అఖిల్ సినిమాలు విజయం సాధించలేనప్పటికీ కూడా ఆయన అందానికి చాలామంది ఫిదా అయ్యారు. ఈ అక్కినేని హీరో సినీ కెరియర్ గురించి చెప్పాలి అంటే అఖిల్‌కు జంటగా సినిమాల్లో నటించిన చాలామంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో కనిపించకుండా పోయారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అఖిల్ సినిమాల విషయంలోకి వెళితే అఖిల్ మొదటి సినిమా అఖిల్ అనే పేరుతోనే వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సయేషా సైగల్ నటించింది.ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ కి తెలుగులో మరో సినిమా అవకాశం రాలేదు.
ఆ తర్వాత అఖిల్ రెండో సినిమా హాల్లో కూడా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియదర్శిని కూడా మరో సినిమా అవకాశం లేకుండా చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది. అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్.. ఈ సినిమా కన్నా ముందే మరో అక్కినేని హీరో నాగచైతన్య కి జంటగా సవ్యసాచి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.
మళ్లీ ఆ సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మకి అవకాశాలే లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఇక గత సంవత్సరం నాలుగో సినిమాగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ మోస్తరు విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జంటగా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ కూడా పూజ సినీ కెరియర్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో నేటిజన్లో అఖిల్‌తో సినిమాా చేస్తే హీరోయిన్ల జీవితం నాశనం అయిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.