హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న అనుష్క..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వ‌చ్చిన‌ సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఒకవేళ ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా మగధీర ఎన్నో రికార్డులను క్రియేట్ చేసేది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ తొలి సినిమా చిరుత తర్వాత రెండో సినిమాగా మగధీర వచ్చింది. తన రెండో సినిమాతోనే చరణ్ తన సత్తా ఏంటో టాలీవుడ్ కి చూపించాడు.

Watch Magadheera Full Movie Online for Free in HD Quality | Download Now

2009 జూలై 31న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మగధీర. ఈ సినిమా విడుదలై ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రామ్ చరణ్, కాజల్ కెరీర్‌ని ఓ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ సినిమాను తెరకెక్కించిన బడ్జెట్‌కు రెండంతలకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, హీరోయిన్ కాజల్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో కాజల్ కేవలం అందాల ఆరబాతులోనే కాకుండా తన నటనపరంగా కూడా మంచి మార్కులుు దక్కించుకుంది.

Alia Bhatt's RRR Co-Star Ram Charan Tests Positive For Coronavirus; Anushka  Shetty Sends Him A Get Well Soon Message

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కాకుండా అనుష్క శెట్టి ని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉన్నాడనే ఓ సిల్లి రీజన్ తో అనుష్క ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అనుష్క- రామ్ చరణ్ కంటే కాస్త హైట్ లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తే అక్క తమ్ముడు లాగా అనుకుంటారని అనుష్క ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే అనుష్క రాజమౌళి డైరెక్షన్లో అప్పటికే రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమాలో నటించింది. ఒకవేళ మళ్లీ ఈ సినిమాలో క‌నుక అనుష్క నటిస్తే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అని అప్పట్లో సినీ విశ్లేషకులు భావించారట.