చీరకట్టుకి పేరుపెట్టిందే హీరోయిన్ స్నేహ… అదిరిపోయే అందం అంటే ఆమెదే!

నిన్నటి సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే పద్ధతైన తన చీరకట్టుతో స్నేహ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మరీ ముఖ్యంగా మన ఫామిలీ లేడీస్ స్నేహకు పెద్ద ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కొన్ని సార్లు జనాలకి పిచ్చెక్కిస్తున్నాయి. అవును, క్రేజీ పోస్టులతో కుర్రాళ్లను ఖుషీ చేస్తున్నారు. తనకు ఇష్టమైన చీరకట్టులో ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ సదరు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఆ అందమైన ఫోటోలను చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా ట్రెడిషనల్ వేర్స్ లోనే గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ షాక్ కి గురి చేస్తున్నారు. క్రమం తప్పకుండా రోజువారీగా తన బ్యూటీఫుల్ ఫొటోషూట్ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

ఇకపోతే స్నేహ చీరకట్టు గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్నేహ ఒక్కసారి చీర కట్టిందంటే చీరకే అందం తెచ్చిపెట్టింది అని అందరు అంటుంటారు. అలా ఊరికే అనడంకాదు… అది నిజం కూడా. ఈ క్రమంలో ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలను చూసి అయితే ఆడవాళ్లకే కుళ్ళు కలుగుతోంది. ఎందుకు కలగదు? 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమె అలా కనబడుతోందంతే ఎవరికి మాత్రం కుళ్ళు కలగదు. కావాలంటే ఇక్కడ వున్న ఫోటోలు చూడండి!

Share post:

Latest