గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. నటి భువనేశ్వరి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించింది నటి భువనేశ్వరి. దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, సీమశాస్త్రి , ఆంజనేయులు వంటి సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళ్ లో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది. 2015 తర్వాత నుంచి ఈమె అటు సిల్వర్ స్క్రీన్ పైన బుల్లితెర పైన అసలు కనిపించలేదు. భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో జన్మించింది.

Bhuvaneswari: Bhuvaneswari, who used to wave at that time.. now has  completely changed.. shocking look |
నటన పైన ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగం నుంచి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలువురి చేతిలో మోసపోయింది అని వార్తలు వినిపించాయి. ఏదోలా కష్టపడి సీరియల్స్ లో వేశాలను అయితే సంపాదించుకుంది. కానీ అలా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దీంతో చెన్నైలో ఈమె వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిందని వార్తలు బాగా వినిపించాయి. దీంతో పాటు ప్రముఖ నిర్మాత పైన ఈమె పై చీటింగ్ కేసు వేయడం జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేసింది అంటూ వార్తలు వినిపించాయి.

Bhuvaneswari: Bhuvaneswari, who used to wave at that time.. now has  completely changed.. shocking look |

అయితే ఇన్ని రోజులకు ఈమె తిరుమల తిరుపతి ఆలయంలో కనిపించడం జరిగింది అయితే మొదట ఈమెను ఎవరు గుర్తుపట్టలేదు. ఎవరో వ్యక్తి చెప్పడంతో ఆమె అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా కంగుతున్నారట. మత్తెక్కించే అందాలతో అప్పట్లో ఒక ఊపు ఊపేసిన భువనేశ్వరి వయసు మీద పడుతూ ఉండడంతో ఇలా పూర్తిగా బొద్దుగా మారిపోయింది. ప్రస్తుతం భువనేశ్వర్ కి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.