చెయ్యని తప్పు వల్ల సినీ కెరీర్ పాడు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలు లేదా హీరోల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వివాదాల వల్ల కొంతమంది కెరీర్ నాశనం అవుతూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాలెంట్ ఉండి కూడా కెరీర్ నాశనం అయిపోయిన నటులు అందరూ ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సుమన్

సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మాస్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పట్లో సుమన్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతో సందడి చేసేవారు. కానీ కొంతకాలం తరువాత సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కున్నాడు. అప్పటినుండి ఎన్నో సినిమాలో హీరోగా నటించాడు కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఎప్పుడో ఒకసారి విలన్ పాత్రలలో నటిస్తూ కెరీర్‌ని కొనసాగిస్తున్నాడు.

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఉదయ్ కిరణ్ తన మొదటి మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. దాంతో అందరూ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ సూపర్‌గా ఉంటుందని ఆశపడ్డారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పెళ్లి మాత్రం జరగలేదు. ఇక అప్పట్నుంచి అతనికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు.

చిత్రం శ్రీను

చిత్రం శ్రీను కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. అతని కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అలాగే కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక దాంతో అతని మొదటి భార్య శ్రీనుపై కేసు పెట్టింది. అంతేకాకుండా అతని మొదటి భార్య అందరూ చూస్తుండగా కోర్ట్ ముందే శ్రీనుని, అతని రెండో భార్యని కొట్టింది. ఇక అప్పటినుంచి శ్రీను పై అందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ కలిగింది. అలా అతనికి కూడా అవకాశాలు చిన్నచిన్నగా తగ్గుతూ వచ్చాయి.