నా డ్రీమ్ నెర‌వేర‌బోతుంది.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య తమన్నా జోరు తగ్గినట్టు అనిపించినా.. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ తన హవాను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ‌ర‌ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన `జైలర్` మూవీలో నటిస్తోంది. వీటితో పాటు బాంద్రా, బోల్ చుడియా అనే మ‌రో రెండు చిత్రాల‌కు సైన్ చేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన తమన్నా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా త‌న ప్రాజెక్ట్స్ గురించి త‌మ‌న్నా మాట్లాడింది. అలాగే ర‌జ‌నీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ప‌ట్ల ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటిస్తుండటం చాలా హ్యాపీ ఉందద‌ని త‌మ‌న్నా తెలిపింది. ఏ హీరోయిన్ కైనా రజినీసార్ తో కలిసి పనిచేయడం డ్రీమ్ గా ఉంటుంది, తన‌కూ కొన్నేండ్లుగా అదే డ్రీమ్ ఉంది, అది ఇప్పుడు నెర‌వేర‌బోతోంద‌ని త‌మ‌న్నా తెగ మురిసిపోయింది.